Dan dana dan Song Lyrics - Spoorthi Jithender

 

Dan dana dan | Folk Song | Spoorthi Jithender | Thirupathi Matla - Spoorthi Jithender Lyrics


Dan dana dan | Folk Song | Spoorthi Jithender | Thirupathi Matla
Singer Spoorthi Jithender
Composer Thirupathi Matla
Music Thirupathi Matla
Song WriterThirupathi Matla

Lyrics

ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…

ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…

కొమ్మలు పూసే.. కొమ్మలు కాసే… కొమ్మల కొనకు కోయిల కూసే..
మట్టీ వాసన గుప్పున లేసే…. సిట్టీ గుండెను తట్టీ లేపే…

అట్ల పోయే ఆవుల మందా… పచ్చి పాలు కుండల నిండా
పాల తీరు అచ్చమైన పడుసూ జంట మనదంట…

ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె

ముక్కూ పుల్ల మెరుపందం… సెవులకు బుట్టాలందం…
మోసేతి గాజూలందం… ధన్ ధన ధన ధనారె…

నాగుపాము నడకందం… నడుఒంపుల సిరులందం…
నిగనిగల కురులందం… ధన్ ధన ధన ధనారె…

ముట్టుకుంటే మాసిపోతా… పట్టుకుంటే జారిపోతా…
పల్లె ఒడిలో లేడి పిల్లలా… గిరగిర పరుగులు పెడతా…

ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె

సెరువుల కమలములందం… సెలియలకు కనులందం…
పెదవులపై ఎరుపందం… ధన్ ధన ధన ధనారె…

ముద్దు ముద్దు ముచ్చటలందం… తియ్యని తేనెల చందం…
వరసైనోడితో బంధం… ధన్ ధన ధన ధనారె…

నవ్వులల్లో పూవుల వాన… తడిసె అణువణువునా…
ఎద సాటు అందాలన్నీ… కొంగుసాటున దాసుకోనా…

ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె

సిన్ని సిన్ని అలకలు అందం… సిన్నదాని వన్నెలు అందం…
సెడుగుడు ఆటల పందెం… ధన్ ధన ధన ధనారె…

మబ్బులలో జాబిలీ అందం… చెట్టు సాటు గుసగుసలందం
కన్నె ఈడుకు జోడందం… ధన్ ధన ధన ధనారె…

మది నది పొంగిన వేళా… అలలై ఆశల ఊయల…
ఊగుతు ఊహల లోకం లోన తేలి ఆడాలా…

ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె

ధన ధన… ధనా ధనా.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…

నెమలికి పించెము అందం… సెలిమెకు ఊటలు అందం…
సలిగిళి కౌగిలి అందం… ధన్ ధన ధన ధనారె…

నిదురకు పసితనమందం… నీళ్లకు నురగలు అందం…
తూరుపున పొద్దందం… ధన్ ధన ధన ధనారె…

కమ్మని కలలే నన్ను గిలిగింతలు పెడుతుంటే…
మనసే హాయిని గొలిపే… మాట్ల వారి పాటల…

ధనా ధనా… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…

ధన ధన… ధనా ధనా.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…


Dan dana dan | Folk Song | Spoorthi Jithender | Thirupathi Matla Watch Video

No comments:

Post a Comment