Dandalayya Undralayya - Coolie No1 Movie | Venkatesh | Tabu | Ilaiyaraaja | S. P. Balu - S. P. Balu Lyrics


Dandalayya Undralayya - Coolie No1 Movie | Venkatesh | Tabu | Ilaiyaraaja | S. P. Balu
Singer S. P. Balu
Composer Ilaiyaraaja
Music Ilaiyaraaja
Song WriterSirivennela Seetarama Sastry

Lyrics

జై జై జై జై గణేష జై జై జైజై… జై జై జై జై వినాయక జై జై జై
(జై జై జై జై గణేష జై జై జైజై… జై జై జై జై వినాయక జై జై జై)

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి… తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి… తోడు నీడ అందించయ్యా
ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ హో హోయ్
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర
పాపం కొండంత నీ పెనుభారం, హొయ్ హొయ్
ముచ్చెమటలు కక్కిందిరా… ముజ్జగములు తిప్పిందిరా
హోహో హో, జన్మ ధన్యం… హొయ్ హొయ్ హొయ్
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర
పాపం కొండంత నీ పెనుభారం, హొయ్ హొయ్
ముచ్చెమటలు కక్కిందిరా… ముజ్జగములు తిప్పిందిరా
హోహో హో, జన్మ ధన్యం… హొయ్ హొయ్ హొయ్

అంబారిగ ఉండగల ఇంతటి వరం… అయ్యోర అయ్యా
అంబాసుతా ఎందరికి లభించురా… అయ్యోర అయ్యా
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా..!!

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ

శివుని శిరసు సింహాసనం… పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం, హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగిందిగా… తగిన ఫలం దక్కిందిగా
ఏవైపోయింది గర్వం, హొయ్ హొయ్ హొయ్
అరె, శివుని శిరసు సింహాసనం… పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం, హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగిందిగా… తగిన ఫలం దక్కిందిగా
ఏవైపోయింది గర్వం, హొయ్ హొయ్ హొయ్

త్రిమూర్తులే నిను గని తలొంచరా… అయ్యోర అయ్యా
నిరంతరం మహిమను కీర్తించరా… అయ్యోర అయ్యా
నువ్వెంతనే అహం… నువ్వే దండించరా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ
అరెరెరెరే, పిండి వంటలారగించీ… తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి… తోడు నీడ అందించయ్యా
ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ హో హోయ్

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ
జైజై జై జై జైజై జై జై..




Dandalayya Undralayya - Coolie No1 Movie | Venkatesh | Tabu | Ilaiyaraaja | S. P. Balu Watch Video

No comments:

Post a Comment